
జనరల్

మలయాళ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ఉయిర్ ఓటీటీ రిలీజ్ డేట్ అధికారికంగా ఖరారైంది. థియేటర్లలో మంచి స్పందన అందుకున్న ఈ చిత్రం ఇప్పుడు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ద్వారా మరింత పెద్ద సంఖ్యలో ప్రేక్షకుల ముందుకు రానుంది. రోషన్ మ్యాథ్యూ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి పోలీస్ అధికారి షాజీ మారడ్ కథ, సంభాషణలు అందించగా, బైజు సంతోష్, అతుల్య చంద్ర, శ్రుతి మేనన్, సయామి ఖేర్ కీలక పాత్రలు పోషించారు.
ప్రొబెషనరీ ఎస్సై అజీబ్ దర్యాప్తు చేసే ఓ మహిళ హత్య కేసుతో కథ ప్రారంభమవుతుంది. సాధారణ కేసుగా కనిపించిన ఈ దర్యాప్తు వెనుక భారీ నేర ముఠా ఉన్నట్లు అతడు గుర్తిస్తాడు. ఉత్కంఠభరితమైన కథనం, సహజమైన పోలీస్ విచారణ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిత్రం ఆగస్టు 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!