
జనరల్

ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూసిన హౌస్ ఆఫ్ ది డ్రాగన్ సీజన్ 3 జూన్ 22 నుంచి జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది. ఉదయం 6:30 గంటల నుంచి తొలి ఎపిసోడ్ అందుబాటులోకి వచ్చింది. టార్గెరియన్ వంశానికి చెందిన అంతర్యుద్ధం, అధికారం కోసం పోరాటాలు, డ్రాగన్ల యుద్ధాలతో ఈ సీజన్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది.
భారతీయ ప్రేక్షకుల కోసం ఈ సీజన్‌ను తెలుగు, తమిళ భాషల్లో కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఒరిజినల్ వెర్షన్‌తో పాటు ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ సౌకర్యం కూడా ఉంది. 18+ ఏజ్ రేటింగ్ పొందిన ఈ సిరీస్‌లో హింసాత్మక సన్నివేశాలు, రక్తపాతం, అడల్ట్ కంటెంట్ ఉంటాయి. ప్రతి సోమవారం కొత్త ఎపిసోడ్ విడుదల కానుండటంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!