

సంగీత దర్శకుడు, నటుడు జీవీ ప్రకాష్ కుమార్ ఇటీవల బ్లాక్ మెయిల్ చిత్రంతో మంచి స్పందన పొందిన తరువాత కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లక్కీ. అనస్వర రాజన్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని పుష్ప కందస్వామి నిర్మించగా, ఉదయ్ మహేష్ దర్శకత్వం వహించారు. వినోదంతో పాటు ప్రేమ, కుటుంబ భావోద్వేగాలు మరియు సమకాలీన రాజకీయ అంశాల మేళవింపుతో ఈ సినిమా రూపొందింది.
తప్పిపోయిన ‘లక్కీ’ అనే కుక్కపిల్ల మరియు ఒక ఆటిజం చిన్నారి చుట్టూ కథ తిరుగుతుంది. రాజకీయ నాయకుడి చేతిలో చిక్కుకున్న ఆ కుక్కపిల్లను హీరో ఎలా రక్షిస్తాడు అన్నదే చిత్రంలోని ప్రధాన కథాంశం. మేఘన సుమేష్, దేవదర్శిని, ఇలంగో కుమరవేల్, ఉదయ్ మహేష్, సుబ్బు తదితరులు ముఖ్య పాత్రల్లో నటించగా, కోవై సరళ, తంబిరామయ్య, మొట్టై రాజేంద్రన్ వాయిస్ పాత్రలు అందించారు. కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ చిత్రం జియో హాట్స్టార్ ఓటీటీలో ఈ నెల 20న విడుదలై మంచి స్పందన పొందుతోంది.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!