

బాబీ డియోల్, సాన్యా మల్హోత్రా ప్రధాన పాత్రల్లో నటించిన సస్పెన్స్ డ్రామా చిత్రం ‘బందర్’ ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. అనురాగ్ కశ్యప్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సప్నా పబ్బి, సబా ఆజాద్, ఇంద్రజిత్ సుకుమారన్, రాజ్ బి. శెట్టి కీలక పాత్రలు పోషించారు. నిఖిల్ ద్వివేది, అనురాగ్ కశ్యప్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి అమిత్ త్రివేది, విశాల్ మిశ్రా సంగీతం అందించారు. 2026 జూన్ 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తాజాగా ఆగస్టు 28 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు.
‘బందర్’ కథ సమర్ మెహ్రా అనే 50 ఏళ్ల మాజీ పాప్ స్టార్, టీవీ నటుడి చుట్టూ తిరుగుతుంది. కెరీర్‌లో అవకాశాలు తగ్గిన సమయంలో మాజీ ప్రేయసి గాయత్రితో విడిపోయిన సమర్‌పై తీవ్రమైన నేరారోపణ వస్తుంది. తాను నిర్దోషినని చెప్పినా మీడియా, ప్రజలు అతడిని దోషిగా చిత్రీకరిస్తారు. చివరకు జైలుకు వెళ్లిన సమర్.. అక్కడ తోటి ఖైదీల వేధింపులను ఎదుర్కొంటూ ఎలా జీవించాడన్నదే కథ. అసలు నిజం ఏమిటనేది ప్రేక్షకుల ఆలోచనకే వదిలేస్తూ సినిమా ముగుస్తుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!