

జింబాబ్వేతో జరగనున్న ముత్తూట్ ఫిన్‌కార్ప్ టీ20, వన్డే సిరీస్‌లకు భారత మహిళల జట్లను సెలెక్షన్ కమిటీ ప్రకటించింది. రెండు ఫార్మాట్లలోనూ స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీ20 జట్టుకు షఫాలీ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపిక కాగా, వన్డే జట్టుకు దీప్తి శర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. టీ20 సిరీస్ రాయ్‌పూర్‌లో, వన్డే సిరీస్ వడోదరలో జరగనుంది.
టీ20 జట్టులో హర్మన్‌ప్రీత్ కౌర్, నికీ ప్రసాద్, అనుష్క శర్మ, రిచా ఘోష్, జి. కమలిని, దీప్తి శర్మ, ప్రేమా రావత్, శ్రీ చరణి, నందిని శర్మ, క్రాంతి గౌడ్, అరుంధతి రెడ్డి, జింటిమణి కలితా, మిన్ను మణి చోటు దక్కించుకున్నారు. వన్డే జట్టులో ప్రతికా రావల్, హర్లీన్ డియోల్, తేజల్ హసబ్నిస్, రిచా ఘోష్, యస్తికా భాటియా, వైష్ణవి శర్మ, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, సాయిలి సత్ఘరే, రేణుకా ఠాకూర్ ఉన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!