
షోస్

విపక్ష ఎంపీలు తమను కలవాలంటే ముందుగా అధికారికంగా విజ్ఞప్తి పంపాలని ఎన్నికల సంఘం తెలిపింది. సాయంత్రం 4 గంటల వరకు తమకు ఎలాంటి విజ్ఞప్తి అందలేదని, ఆ తర్వాతే వినతిపత్రం అందిందని ఈసీ పేర్కొంది. సుమారు 240 మంది ఎంపీలతో ఒకేసారి భేటీ కావడం అసాధారణమైన విషయమని స్పష్టం చేసింది.
ఇండియా కూటమి ఎంపీలు సమర్పించనున్న వినతిపత్రాన్ని స్వీకరించేందుకు సీనియర్ అధికారిని పంపుతామని చెప్పినప్పటికీ, ఎంపీలు అందుకు నిరాకరించారని ఈసీ తెలిపింది. ఓటర్ల జాబితా, ప్రత్యేక సమగ్ర సవరణకు సంబంధించిన అంశాలపై ఇండియా కూటమి చేపట్టిన నిరసనల నేపథ్యంలో ఈ వివరణ వెలువడింది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!