

‘మంజుమ్మెల్ బాయ్స్’ చిత్రంతో దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన దర్శకుడు చిదంబరం తెరకెక్కించిన తాజా చిత్రం ‘బాలన్ ది బాయ్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కేవీఎన్ ప్రొడక్షన్స్, తెస్పియన్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం సహజమైన నేటివిటీ కథతో పాటు బలమైన భావోద్వేగాలు, సెంటిమెంట్‌తో రూపొందింది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో జూన్ 19న విడుదలైన ఈ సినిమా చిన్న చిత్రంగా వచ్చినప్పటికీ భారీ విజయాన్ని సాధించి ప్రేక్షకాదరణ పొందింది.
ఇప్పుడు ఈ సూపర్ హిట్ మూవీ ఓటీటీ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 ఈ చిత్రానికి డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. జూలై 31 నుండి మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో ప్రసారం ప్రారంభం కానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. థియేటర్లలో విజయాన్ని అందుకున్న ఈ చిత్రం ఓటీటీలో కూడా మంచి స్పందన అందుకుంటుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!