

జీ5లో జూలై 17 నుంచి స్ట్రీమింగ్ కానున్న ‘శివలోక్ కె కుండక్క మండక్క’ యానిమేటెడ్ వెబ్ సిరీస్, ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రచించిన పిల్లల పుస్తకం ‘ది వెరీ ఎక్స్‌ట్రీమ్లీ మోస్ట్ నాటీ అసుర టేల్స్ ఫర్ కిడ్స్’ ఆధారంగా రూపొందింది. కుండక్క, మండక్క అనే ఇద్దరు అల్లరి అసుర జంట సాహసాల చుట్టూ సాగే ఈ కథలో స్నేహం, ధైర్యం, ఆత్మవిశ్వాసం, జీవిత విలువలను వినోదాత్మకంగా చూపించనున్నారు.
రామాయణం, మహాభారతం వంటి తెలిసిన కథలతో పాటు భారతీయ పౌరాణిక ప్రపంచంలోని కొత్త పాత్రలు, కొత్త లోకాలు, ఆసక్తికరమైన అడ్వెంచర్లను ఈ సిరీస్ పరిచయం చేయనుంది. హిందీ, తెలుగు, తమిళం, కన్నడ, బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులోకి రానున్న ఈ సిరీస్ పిల్లలు, కుటుంబ ప్రేక్షకులను అలరించడమే కాకుండా భారతీయ పురాణాలను కొత్త కోణంలో ఆస్వాదించేలా రూపొందించారు. తన పుస్తకంలోని పాత్రలు యానిమేషన్ రూపంలో ప్రేక్షకుల ముందుకు రావడం ఎంతో ఆనందంగా ఉందని రచయిత ఆనంద్ నీలకంఠన్ తెలిపారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!