

ఓటీటీ రంగంలో పోటీని మరింత పెంచేలా జీ5 తన రాబోయే భారీ కంటెంట్ లైనప్‌ను ప్రకటించింది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న పలు క్రేజీ సినిమాల డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న జీ5, తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీ భాషల్లో రూపొందుతున్న సినిమాలు, వెబ్ సిరీస్‌లను తన వేదికపై విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. నెట్‌ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్‌లకు పోటీగా జీ5 కూడా తన కంటెంట్‌ను విస్తరిస్తోంది.
తెలుగులో నాగచైతన్య నటిస్తున్న 'వృషకర్మ', బాలకృష్ణ 'NBK111', వెంకటేశ్-అనిల్ రావిపూడి కాంబినేషన్ మూవీ, కల్యాణ్‌రామ్ కొత్త చిత్రం, నివేదా థామస్ 'శ్రీమతి', శ్రీకాంత్ 'అబ్జెక్షన్ మై లార్డ్', 'అనంతకాలం' వెబ్ సిరీస్, జగపతిబాబు 'జయమ్ము నిశ్చయమ్మురా 2' టాక్ షో వంటి పలు ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులు ఈ లైనప్‌లో ఉన్నాయి. వీటితో పాటు హిందీ, తమిళ భాషల్లో పలు ఒరిజినల్స్, యానిమేషన్, ఏఐ ఆధారిత పౌరాణిక చిత్రాలను కూడా జీ5 ప్రకటించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!