

అక్కినేని అఖిల్ కెరీర్‌లో భారీ విజయాన్ని అందుకున్న చిత్రం ‘లెనిన్’. భారీ అంచనాల మధ్య జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ రూరల్ యాక్షన్ డ్రామా మొదటి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించింది. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని మురళీ కిశోర్ అబ్బూరు తెరకెక్కించగా, అక్కినేని నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించి అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.
థియేటర్లలో ఘన విజయం సాధించిన ‘లెనిన్’ ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకుంది. ఆగస్టు 7 నుంచి జీ5లో తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం అందుబాటులోకి రానుంది. థియేటర్లలో మిస్ అయినవారు, మరోసారి చూడాలనుకునే అభిమానులు ఈ బ్లాక్‌బస్టర్‌ను ఓటీటీలో వీక్షించవచ్చు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!