

బాలీవుడ్‌లో మంచి గుర్తింపు పొందిన ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ ఫ్రాంచైజీ ఇప్పుడు సరికొత్త మలుపు తీసుకుంటోంది. ఈ సినిమాల ఆధారంగా ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్: ఆఫ్టర్ డార్క్’ పేరుతో మిస్టరీ థ్రిల్లర్ సిరీస్‌ను రూపొందించారు. తాజాగా ఈ సిరీస్ ట్రైలర్‌ను విడుదల చేశారు. గత చిత్రాలకు భిన్నంగా పాఠశాల నేపథ్యంలో సాగే రహస్యాలు, అనుమానాలు, ఓ విద్యార్థిని మరణం చుట్టూ ఈ కథ తిరగనుంది.
ఈ సిరీస్‌లో షనయా కపూర్ ఆయేషా మాలిక్, అదితి అనే కవల సోదరీమణుల పాత్రల్లో కనిపించనుంది. ట్రైలర్ ప్రకారం, ఆయేషా అనుకోకుండా మరణిస్తుంది. అయితే తన సోదరి మరణం ప్రమాదవశాత్తు జరగలేదని భావించిన అదితి, అసలు నిజాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఇందుకోసం సెయింట్ థెరిసా పాఠశాలలో రహస్యంగా ప్రవేశించి, అక్కడ జరిగే ‘స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్’ పోటీలో పాల్గొంటుంది. ఈ క్రమంలో బయటపడే రహస్యాలే కథలో కీలకంగా నిలవనున్నాయి. రీమా మాయ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ నవంబర్ 13 నుంచి జియోహాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!