

కృత్రిమ మేధ (ఏఐ) ప్రతి రంగంలోనూ ఊహించని మార్పులకు కారణమవుతోంది. సినీ పరిశ్రమలోనూ చిత్రీకరణ, విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ వంటి విభాగాల్లో ఏఐ వినియోగం ఇప్పటికే పెరిగింది. ఇప్పుడు ఏఐతో రూపొందించిన నటులు కూడా తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఏఐ నటుడు ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ను తొలిసారిగా తీసుకొస్తున్నట్లు ఓటీటీ సంస్థ లయన్స్‌గేట్ ప్లే ప్రకటించింది. ‘ఏకలవ్య’ పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్‌తో వినోద రంగంలో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది.
మహాభారతంలోని ఏకలవ్యుడి పాత్ర ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రధాన పాత్రధారి పూర్తిగా ఏఐ సాంకేతికతతో రూపొందించిన నటుడు కావడం విశేషం. ఈ ఏఐ నటుడికి ‘యుగ్ ఆర్.ఏఐ’ (YUG R.Ai) అని పేరు పెట్టారు. అతడిని పరిచయం చేస్తూ లయన్స్‌గేట్ ప్లే ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. విభు పురి దర్శకత్వం వహిస్తున్న ఈ వెబ్‌సిరీస్ వచ్చే ఏడాది హిందీ, తెలుగు, తమిళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. భవిష్యత్తులో మరిన్ని ఏఐ ఆధారిత ఒరిజినల్ కంటెంట్‌ను ప్రేక్షకులకు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!