
ఓటీటీ

ఉక్రెయిన్‌కు అమెరికా భారీ రక్షణ ప్యాకేజీని ప్రకటించింది. ఎఫ్-16 యుద్ధ విమానాల నిర్వహణకు అవసరమైన పరికరాలు, విడిభాగాల కొనుగోలు కోసం 621.9 మిలియన్ డాలర్ల ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ నిధులు ఉక్రెయిన్ వైమానిక రక్షణ సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉపయోగపడనున్నాయి.
ఈ ప్యాకేజీ కోసం బెల్జియం, డెన్మార్క్, నెదర్లాండ్స్, నార్వే దేశాల సహకారంతో నిధులను సమీకరించినట్లు సమాచారం. ఎఫ్-16 యుద్ధ విమానాల నిర్వహణకు అవసరమైన పరికరాలు అందుబాటులోకి రావడంతో వాటి కార్యకలాపాలకు మరింత మద్దతు లభించనుంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!