

ఎన్విడియా ఎగ్జిక్యూటివ్ జే పూరి వ్యక్తిగత జీవితం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎన్విడియా క్లయింట్ సంస్థ సూపర్ మైక్రో కంప్యూటర్‌కు చెందిన అధికారి సెంలీ చెన్‌ను ఆయన ఈ ఏడాది మార్చిలో వివాహం చేసుకున్నారు. అయితే, చిప్స్ సరఫరా కోసం ఇరు సంస్థలు పోటీపడుతున్న సమయంలోనే వీరిద్దరూ డేటింగ్ చేసినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ (WSJ) తన కథనంలో వెల్లడించింది. ఇప్పటికే ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్‌కు సంబంధించిన వివాదం చర్చలో ఉండగా, తాజాగా జే పూరి వ్యవహారం తెరపైకి రావడం ఆసక్తికరంగా మారింది.
చైనాకు చిప్స్ అక్రమ రవాణా చేసిన కేసులో సూపర్ మైక్రో ఉద్యోగులపై ఆరోపణలు ఉండటంతో ఈ వ్యవహారంపై మరింత ఆసక్తి నెలకొంది. వ్యాపార సంబంధాలు, వ్యక్తిగత అనుబంధాల మధ్య ప్రయోజనాల సంఘర్షణ తలెత్తిందా అనే ప్రశ్నలు చర్చకు వస్తున్నాయి. అయితే, వ్యాపార ప్రయోజనాల కోసం తమ వ్యక్తిగత సంబంధాన్ని ఉపయోగించుకోలేదని సెంలీ చెన్ స్పష్టం చేసినట్లు నివేదిక పేర్కొంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!