
జనరల్

నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్‌చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. డీహైడ్రేషన్ సమస్యతో ఇబ్బందిపడుతున్న ఆయనను ముంబయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి తరలించినట్లు ఆయన కుమార్తె, బారామతీ ఎంపీ సుప్రియా సూలే ఎక్స్ వేదికగా వెల్లడించారు. గతంలో ఛాతీ నొప్పి, శ్వాసకోశ ఇన్ఫెక్షన్‌తో బాధపడిన పవార్ ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందారు. అనంతరం నవంబర్ 5న డిశ్చార్జి అయ్యారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణాలు చేయవద్దని వైద్యులు సూచించినప్పటికీ, పవార్ తమ సూచనలను పట్టించుకోకుండా పనుల్లో నిమగ్నమవుతున్నారని సుప్రియా సూలే పేర్కొన్నారు. ఆయన తాజా ఆసుపత్రి చేరికతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల్లో ఆందోళన నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!