

హైదరాబాద్‌లో వరుసగా వస్తున్న బాంబు బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో నగరం మొత్తం అప్రమత్తంగా ఉందని పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. రద్దీ ప్రాంతాల్లో బాంబు డిస్పోజల్, డాగ్ స్క్వాడ్‌లతో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. విమానానికి బాంబు బెదిరింపు వచ్చినప్పుడు భద్రతా నిబంధనల ప్రకారం విమానాన్ని వెనక్కి రప్పించి, ప్రయాణికులను ఖాళీ చేయించాల్సి ఉంటుందని వివరించారు. ప్రజల భద్రత దృష్ట్యా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు.
బెదిరింపు మెయిల్స్ పంపుతూ ప్రజలను భయాందోళనలకు గురిచేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సీవీ ఆనంద్ హెచ్చరించారు. నిందితులను గుర్తించేందుకు సైబర్ క్రైమ్ బృందాలు ప్రత్యేకంగా దర్యాప్తు చేస్తున్నాయని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయంతో తమ లొకేషన్‌ను దాచిపెట్టి మెయిల్స్ పంపుతున్నట్లు ప్రాథమికంగా గుర్తించామని వెల్లడించారు. త్వరలోనే నిందితులను గుర్తించి పట్టుకుంటామని ఆయన స్పష్టం చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!