26, నవంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!

Writer: Pooja 04:04 PM, 26 నవంబర్, 2026
పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!

సోషల్ మీడియాలో సినిమా పాటలు విడుదలైన వెంటనే వాటికి విపరీతమైన క్రేజ్ వస్తోంది. ఆకట్టుకునే బీట్స్‌తో రూపొందిన పాటలు ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో వైరల్ అవుతూ, యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్ సాధిస్తున్నాయి. దీంతో సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడుతున్నాయి. అయితే పాటలతో వచ్చిన హైప్‌కు, థియేటర్లలో కనిపించే సినిమా కథకు పొంతన లేకపోవడంతో కొందరు ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. కేవలం చార్ట్‌బస్టర్ పాటలతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించవచ్చనే ఆలోచనతో కొందరు దర్శకనిర్మాతలు ముందుకెళ్తున్నారనే చర్చ టాలీవుడ్‌లో మొదలైంది. ఈ వ్యూహం తొలి రోజు వసూళ్లకు ఉపయోగపడినా, సినిమా విజయాన్ని నిలబెట్టలేకపోతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఇటీవల విడుదలైన ‘పెద్ది’, ‘ది ప్యారడైజ్’, ‘ఓం’ సినిమాలు ఈ చర్చకు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. ‘పెద్ది’లోని ‘రై రై రా రా’, ‘చికిరి’, ‘మస్సా మస్సా’ పాటలు భారీ క్రేజ్ సంపాదించినప్పటికీ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ‘ది ప్యారడైజ్’లోని ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల కట్ట’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకున్నా, బాక్సాఫీస్ వద్ద సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిందనే అభిప్రాయాలు వినిపించాయి. తాజాగా ‘ఓం’ సినిమాలోని ‘వీరా’ పాట కూడా అన్ని భాషల్లో మంచి ఆదరణ పొందింది. అయితే సినిమా సెకండాఫ్‌పై కొందరు ప్రేక్షకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాటలు సినిమాకు ప్రచారం కల్పించగలవని, కానీ కథలో బలం, ఆసక్తికరమైన కథనం లేకపోతే విజయాన్ని అందించలేవని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే మేకర్స్ ఆడియో హైప్‌తో పాటు బలమైన కథకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా

దేశభక్తి కథాంశంతో అర్జున్ సర్జా భారీ పాన్ ఇండియా సినిమా

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది

పవన్ కళ్యాణ్‌తో విభేదాలపై ఎట్టకేలకు స్పందించిన సంపత్ నంది

జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న అఖిల్ ‘లెనిన్’

జపాన్‌లో విడుదలకు సిద్ధమవుతున్న అఖిల్ ‘లెనిన్’

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!

వృశకర్మ కథలో నాగచైతన్యను అంతగా ఆకట్టుకున్న అంశాలివే!

ఏడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈఎన్‌ఈ రిపీట్‌

ఏడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన ఈఎన్‌ఈ రిపీట్‌

ట్యాగ్లు
టాలీవుడ్ వార్తలుసినిమా పాటలుబాక్సాఫీస్సినీ సంగీతంతెలుగు సినిమాసినిమా సమీక్షలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!
జనరల్

సైబరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలకు చెక్.. వన్‌వే విధానం, ప్రత్యేక బస్ లైన్ల ఏర్పాటు!

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్
సినిమాలు

సమంత డెలివరీపై శోభారాజు చేసిన వ్యాఖ్యలు వైరల్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ
బిజినెస్

ప్రపంచంలో మూడో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజ్‌గా ఎన్‌ఎస్‌ఈ

ఎన్విడియాలో మరో ప్రేమకథ..
జనరల్

ఎన్విడియాలో మరో ప్రేమకథ..

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!
సినిమాలు

పాటలతో హైప్..కథతోనే అసలు పరీక్ష!

తిరుమల శ్రీవారికి 46 రకాల ప్రత్యేక బంగారు ఆభరణాల కానుక
జనరల్

తిరుమల శ్రీవారికి 46 రకాల ప్రత్యేక బంగారు ఆభరణాల కానుక

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘సంవిధాన్ రక్షా మార్చ్’..
రాజకీయాలు

హైదరాబాద్‌లో కాంగ్రెస్ ‘సంవిధాన్ రక్షా మార్చ్’..

ఎయిడ్స్ నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ
జనరల్

ఎయిడ్స్ నియంత్రణలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు
జనరల్

పాక్ వెబ్‌సిరీస్ ప్రసారంపై నెట్‌ఫ్లిక్స్‌కు కేంద్రం ఆదేశాలు

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు
జనరల్

పీఎంఎల్‌ఏ న్యాయనిర్ణాయక సంస్థపై సుప్రీంకోర్టు కీలక తీర్పు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
రాజకీయాలు

ఏపీలో ముగిసిన తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..
జనరల్

బ్యాంకాక్‌లో చమురు డిపోలో భారీ పేలుడు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!