

ఈ వీకెండ్ ఓటీటీ వేదికల్లో వరుసగా కొత్త సినిమాలు, సిరీస్‌లు విడుదలవుతున్న నేపథ్యంలో మరో ఆసక్తికరమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండేళ్ల క్రితం తమిళంలో విడుదలైన ఆంథాలజీ థ్రిల్లర్ ‘అధర్మ కథైగల్’ ఇప్పుడు తెలుగులో ‘4వ అధ్యాయం’ పేరుతో అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి పెద్ద ప్రచారం లేకుండానే ఈ చిత్రం నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
ఈ సినిమాను దర్శకుడు కామరాజ్ వెల్ తెరకెక్కించగా, వెట్రి, అమ్ము అభిరామి, సాక్షి అగర్వాల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ వేదికలో తెలుగులో స్ట్రీమింగ్ అవుతూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. థ్రిల్లర్ కథలతో కూడిన ఈ ఆంథాలజీ మూవీకి ప్రత్యేకమైన కాన్సెప్ట్ ఉండటం విశేషం.
‘4వ అధ్యాయం’లో మొత్తం నాలుగు కథలు ఉంటాయి. మొదటి కథలో నందిని అనే నర్స్ ఒక గాయపడిన రౌడీ కారణంగా చిక్కుల్లో పడుతుంది. రెండో కథలో ఆన్లైన్ జూదానికి బానిసైన యువకుడు డబ్బుల కోసం ఒక చిన్నపిల్లను కిడ్నాప్ చేస్తాడు. మూడో కథలో బీచ్ పరిసరాల్లో తిరిగే రౌడీలు వరుసగా హత్యకు గురవడం ఆసక్తిని రేకెత్తిస్తుంది.నాలుగో కథలో దివ్య అనే యువతి తన తండ్రి ఆపరేషన్ ఖర్చుల కోసం అద్దె గర్భం తీసుకునే నిర్ణయం తీసుకుంటుంది. ఈ నాలుగు కథలు చివరికి ఎలా ముడిపడతాయి? వాటి ముగింపు ఎలా ఉంటుందనేదే సినిమా ప్రధాన ఆసక్తికర అంశం.
థ్రిల్లర్ జానర్‌ను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం మంచి ఎంగేజ్‌మెంట్‌ను ఇస్తుందని భావిస్తున్నారు. పెద్దగా ప్రచారం లేకుండానే విడుదలైన ఈ మూవీ, కంటెంట్ బలం మీద ఓటీటీలో మంచి స్పందన పొందే అవకాశముంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!