

విరాట్ కర్ణ, నభా నటేష్ ప్రధాన పాత్రల్లో అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కిన మైథలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ నాగబంధం జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. కేరళలోని అనంత పద్మనాభస్వామి ఆలయంలోని నాగబంధం, నిధుల రహస్యాల నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం విజువల్ గ్రాండియర్‌గా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై నిర్మితమైన ఈ చిత్రంలో జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, మురళీ శర్మ, ఐశ్వర్య మీనన్, దక్ష నగార్కర్, అనసూయ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, నాగబంధం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో భారీ మొత్తానికి సొంతం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. థియేటర్లలో విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఓటీటీలో స్ట్రీమింగ్ చేయాలనే ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. ఈ లెక్కన ఆగస్టు రెండో వారంలో సినిమా ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉంది. అయితే బాక్సాఫీస్ ప్రదర్శనను బట్టి విడుదల తేదీలో మార్పులు ఉండొచ్చు. తెలుగులో శాటిలైట్ హక్కులను స్టార్ మా, ఇతర భాషల హక్కులను జీ స్టూడియోస్ దక్కించుకున్నట్లు సమాచారం. ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉంది.













కామెంట్స్ (1)
Waiting