
న్యూస్

ప్రపంచవ్యాప్తంగా యూజర్లను ఇబ్బంది పెట్టిన సాంకేతిక సమస్యను పరిష్కరించినట్లు యూట్యూబ్ యాజమాన్యం ప్రకటించింది. రికమెండేషన్ సిస్టంలో ఏర్పడిన లోపం కారణంగా యూట్యూబ్ హోంపేజీ, యాప్, యూట్యూబ్ కిడ్స్, యూట్యూబ్ మ్యూజిక్‌లో వీడియోలు కనిపించలేదని తెలిపింది. కొందరు యూజర్లు లాగిన్ సమస్యలను కూడా ఎదుర్కొన్నట్లు కంపెనీ వెల్లడించింది.
సమస్యను పూర్తిగా పరిష్కరించామని, ప్రస్తుతం అన్ని సేవలు యథావిధిగా అందుబాటులో ఉన్నాయని యూట్యూబ్ తెలిపింది. సమస్య పరిష్కారం వరకు సహనం వహించిన వినియోగదారులకు ధన్యవాదాలు తెలియజేసింది. డౌన్‌డిటెక్టర్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 3,21,958 ఫిర్యాదులు నమోదయ్యాయి. భారత్‌లో ఉదయం సమయంలో 20,000కుపైగా ఫిర్యాదులు వచ్చాయని, అందులో ఎక్కువగా యూట్యూబ్ యాప్ వినియోగదారుల నుంచే వచ్చినట్లు వెల్లడించింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!