
టెక్నాలజీ

యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బాబ్రీ మసీద్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబ్రీ మసీద్‌ను పునర్నిర్మించడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యంకాదని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తుదిసత్యమని, దానిని గౌరవించాల్సిన బాధ్యత అందరికీ ఉందని ఆయన తెలిపారు.
బాబ్రీ మసీద్ పునర్నిర్మాణానికి ఎవరైనా ప్రయత్నిస్తే తాము అడ్డుకుంటామని యోగి హెచ్చరించారు. చట్టం, రాజ్యాంగం ప్రకారమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని, శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలను సహించబోమని ఆయన స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!