

తెలంగాణలో చలి తీవ్రత మళ్లీ పెరుగుతోంది. వచ్చే మూడు రోజుల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2–3 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ముఖ్యంగా రాత్రి మరియు ఉదయం పూట చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో చల్లని గాలులు బలంగా వీస్తాయని అంచనా వేయడంతో, ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. వృద్ధులు, చిన్న పిల్లలు, అలాగే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఇదిలాఉంటే, వాతావరణశాఖ అధికారులు వచ్చే వారంపాటు అధిక చలి కొనసాగవచ్చని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆదిలాబాద్లో 9.2°C, మెదక్లో 11.3°C, హనుమకొండలో 13.5°C, రామగుండంలో 14.2°C, హైదరాబాద్లో 15.6°C, నల్గొండలో 16°C కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇంకా కొన్ని రోజులు ఇదే పరిస్థితి కొనసాగవచ్చని అధికారులు సూచిస్తూ, ప్రజలు రాత్రి వేళలు బయటకు వెళ్లేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!