

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో భారత్ నుంచి దాదాపు 278కి పైగా అంతర్జాతీయ విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి పలు విమానాలు రద్దైనట్లు విమానయాన అధికారులు తెలిపారు. ప్రాంతంలో భద్రతా పరిస్థితులు మారుతున్న నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
పశ్చిమాసియా ప్రాంతంలో చిక్కుకుపోయిన భారతీయ ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చేందుకు కొన్ని విమానయాన సంస్థలు ప్రత్యేక విమానాలను నడుపుతున్నాయి. స్పైస్‌జెట్ సంస్థ శుక్రవారం 14 ప్రత్యేక విమానాలు నడిపనున్నట్లు ప్రకటించింది. ఫుజైరా నుంచి బయలుదేరే ఈ విమానాల్లో 9 ముంబయికి, 4 దిల్లీకి చేరుకోగా, మరో విమానం దుబాయ్ నుంచి పుణెకు రానుంది. గత మూడు రోజుల్లో మొత్తం 25 ప్రత్యేక విమానాలను నడిపినట్లు సంస్థ వెల్లడించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!