

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలోని విద్యార్థినిలకు ఉచితంగా విద్యుత్ స్కూటీలను అందజేయనున్నట్లు ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రజాభవన్లో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చదువుకునే ఆడపిల్లలు ప్రయాణంలో ఎదుర్కొనే ఇబ్బందులను తగ్గించి వారికి విద్యలో మరింత ప్రోత్సాహం అందించడమే ఈ నిర్ణయ లక్ష్యమని తెలిపారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ పథకాన్ని త్వరలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇప్పటికే మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు, గృహాల కోసం ఆర్థిక సహాయం వంటి పథకాలు అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు విద్యార్థినులకు ఉచిత స్కూటీలు ఇవ్వడం ద్వారా వారి విద్యాభ్యాసానికి తోడ్పాటు లభించడంతో పాటు స్వావలంబన కూడా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!