
క్రీడలు

సరిహద్దు వివాదాలతో గత కొన్ని దశాబ్దాలుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్న పాకిస్థాన్, అఫ్గానిస్థాన్ దేశాల మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. పాకిస్థాన్ ప్రభుత్వం అఫ్గానిస్థాన్‌పై సైనిక చర్యలు ప్రారంభించినట్లు ప్రకటించింది. “గజీబ్ లిల్ హాక్” పేరుతో సైనిక ఆపరేషన్ చేపట్టినట్లు పాకిస్థాన్ రక్షణ మంత్రి వెల్లడించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్గాన్ రాజధాని కాబూల్‌పై వైమానిక దాడులు జరిపినట్లు సమాచారం.
ఈ రోజు తెల్లవారుజామున పాకిస్థాన్ సైన్యం కాబూల్‌తో పాటు కందహార్, పక్తియా వంటి నగరాలపై యుద్ధవిమానాలతో దాడులు చేపట్టింది. అయితే ఈ దాడులను అఫ్గాన్ దళాలు సమర్థవంతంగా ఎదుర్కొన్నట్లు, ఒక పాకిస్థాన్ యుద్ధవిమానాన్ని కూల్చివేసినట్లు వార్తలు వెలువడ్డాయి. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.













.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!