
న్యూస్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై జరుగుతున్న యుద్ధం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ యుద్ధం త్వరలోనే ముగిసే అవకాశముందని ఆయన చెప్పారు. ఇప్పటివరకు సుమారు 5 వేల లక్ష్యాలను ధ్వంసం చేశామని, ఇది ఎక్కువ కాలం కొనసాగే యుద్ధం కాదని, కేవలం స్వల్పకాల సైనిక చర్య మాత్రమే అని ట్రంప్ తెలిపారు.
ఇరాన్లో మొజ్తాబా ఖమేనీని సుప్రీం లీడర్‌గా నియమించడం తనను నిరాశపరిచిందని కూడా ట్రంప్ చెప్పారు. మొజ్తాబా నాయకత్వంలో కూడా పాత సమస్యలే కొనసాగవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఈ యుద్ధ పరిస్థితులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో కూడా మాట్లాడినట్లు తెలిపారు. పుతిన్ ఈ యుద్ధ పరిస్థితిపై సంతృప్తిగా ఉన్నారని ట్రంప్ చెప్పారు.



.jpg&w=3840&q=75)



.jpg&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!