

వరుణ్ తేజ్ హీరోగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కొరియన్ కనకరాజు’ సినిమా ఇప్పటికే అభిమానుల్లో మంచి అంచనాలు పెంచుతోంది. రితికా నాయక్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా హారర్ కామెడీగా రూపొందుతోంది. ఇటీవల వచ్చిన గ్లింప్స్‌లో వరుణ్ తేజ్ కొరియన్లో “నేను తిరిగొచ్చేశా” అని చెప్పడం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ప్రీ-క్లైమాక్స్‌లో వచ్చే ఒక స్పెషల్ కామెడీ సీన్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండబోతుందని చెబుతున్నారు.
ఈ సినిమా ఇండియా, కొరియా లొకేషన్స్‌లో షూటింగ్ పూర్తి చేసుకుంది. థమన్ సంగీతం అందిస్తుండగా, సత్య కీలక పాత్రలో నటిస్తున్నాడు. కొరియాలో జరిగిన చివరి షెడ్యూల్లో ముఖ్యమైన సీన్స్, పాటలు షూట్ చేశారు. వరుణ్ తేజ్ కొత్త లుక్‌లో కనకరాజు పాత్రలో కనిపించబోతుండగా, హారర్‌తో పాటు కామెడీని మిక్స్ చేసి మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు. ఈ సినిమా కొత్త స్టైల్లో వస్తుండటంతో ప్రేక్షకులు రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.





















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!