

గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన అనంతరం మాట్లాడిన అదానీ గ్రూప్ చైర్‌పర్సన్ జీత్ అదానీ, 1 గిగావాట్ హైపర్‌స్కేల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణంతో భారత్ కృత్రిమ మేధ రంగంలో కీలక ముందడుగు వేసిందని తెలిపారు. కంప్యూటింగ్ సామర్థ్యాల పరంగా ఈ ప్రాజెక్ట్ దేశానికి కొత్త శక్తిని అందించనుందని పేర్కొన్నారు. ఇప్పటివరకు ముంబై, చెన్నై నగరాలకు మాత్రమే పరిమితమైన భారీ డేటా సెంటర్ వ్యవస్థలు ఇప్పుడు విశాఖపట్నానికి విస్తరిస్తున్నాయని అన్నారు. దీంతో విశాఖ నగరం భారతదేశ కొత్త డిజిటల్ గేట్‌వేగా ఎదగబోతోందని చెప్పారు.
ఈ ఏఐ డేటా సెంటర్ ద్వారా భారత్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూడా కనెక్టివిటీ మరింత బలపడుతుందని జీత్ అదానీ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వంటి దూరదృష్టి కలిగిన నాయకత్వంలో రాష్ట్రంలో డిజిటల్ మౌలిక వసతులు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రశంసించారు. విశాఖ నగరం ఏఐ విప్లవానికి నాంది పలుకుతోందని అన్నారు. అదానీ గ్రూప్ ప్రపంచ స్థాయి ఏఐ డేటా సెంటర్ల కోసం 100 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రజలు, వ్యాపారాలు, పరిశ్రమలకు అత్యాధునిక ఏఐ సేవలను అందించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.


.jpeg&w=3840&q=75)


_0.jpg.webp&w=3840&q=75)









.jpg&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!