
టెక్నాలజీ

ఓడిశా రాష్ట్రంలోని కేయోంజర్ జిల్లాలో ఒక సంచలన ఘటన చోటుచేసుకుంది. తన చెల్లెలి మరణానికి ఆధారం చూపించాలని బ్యాంకు అధికారులు కోరడంతో, ఓ గిరిజన వ్యక్తి ఆమె మృతదేహాన్ని తవ్వి తీసుకుని బ్యాంకుకు తీసుకువచ్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ ఘటన సోమవారం మధ్యాహ్నం పట్నా పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లిపాసి గ్రామంలో జరిగింది.
జీతు ముండా అనే వ్యక్తి తన చెల్లెలి సేవింగ్స్ తీసుకోవడానికి బ్యాంకుకు వెళ్లగా, ఆమె మరణానికి సంబంధించిన అధికారిక ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని అధికారులు సూచించారు. చదువు తెలియని అతను ఆ ప్రక్రియను అర్థం చేసుకోలేక, చివరకు ఆమె అస్థిపంజరాన్ని తీసుకుని వచ్చాడు. ఈ ఘటనతో బ్యాంకు సిబ్బంది భయాందోళనకు గురై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!