

క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం వైభవ్ సూర్యవంశీ పేరు హాట్‌టాపిక్‌గా మారింది. గత ఏడాదిగా నిరంతరం పరుగులు సాధిస్తున్న ఈ 15 ఏళ్ల లెఫ్టాండర్ బ్యాటర్ ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ తరఫున అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై కేవలం 36 బంతుల్లో శతకం సాధించి తన విధ్వంసకర బ్యాటింగ్‌ను మరోసారి నిరూపించాడు.
ఈ నేపథ్యంలో ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఒలింపిక్ పతక విజేత మనూ భాకర్‌కు వైభవ్ గురించి ప్రశ్న ఎదురైంది. ఆమె మాట్లాడుతూ, సరైన మార్గదర్శనం ఉంటే వయసు ఆటంకం కాదని, ప్రతిభ ఏ వయసులోనైనా వెలుగులోకి రావచ్చని చెప్పారు. వైభవ్ భారత క్రీడల్లో తదుపరి పెద్ద స్టార్‌గా ఎదగవచ్చని ఆమె అభిప్రాయపడింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అయ్యాయి.
అయితే ఈ వ్యాఖ్యలపై ఆన్లైన్లో చర్చలు మొదలయ్యాయి. వివిధ క్రీడల మధ్య అనవసర పోలికలు ఎందుకు తెస్తున్నారని కొందరు విమర్శించారు. మాజీ ఐపీఎల్ టీమ్ డైరెక్టర్ జాయ్ భట్టాచార్య కూడా ఒక ఒలింపిక్ విజేతను క్రికెటర్ గురించి అడగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే సమయంలో పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచి మనూ భాకర్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!