
టెక్నాలజీ

పశ్చిమ బెంగాల్లోని ధనేఖళిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ టీఎంసీపై తీవ్ర విమర్శలు చేశారు. వచ్చే నెల 4న ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత టీఎంసీ కార్యకర్తలు రాజకీయాలు కాకుండా చిన్నపాటి పనులు చేస్తూ కనిపిస్తారని అన్నారు. ఈ నెల 23న జరిగిన తొలి దశ పోలింగ్తోనే టీఎంసీ కేడర్లో భయం మొదలైందని, వారు దాక్కునే పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.
టీఎంసీ ప్రభుత్వాన్ని భయంకర పాలన, మాఫియా రాజ్యం, అవినీతి ప్రతీకగా అభివర్ణించిన యోగి, కేంద్రం పంపిన అభివృద్ధి నిధులను టీఎంసీ కార్యకర్తలు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై కూడా విమర్శలు చేస్తూ, సీఏఏ విషయంలో ఆమె వైఖరిని ప్రశ్నించారు. చొరబాటుదారులకు అవకాశమిస్తూనే, హిందూ పండుగలు మరియు “జై శ్రీరామ్” వంటి నినాదాలపై ఆంక్షలు విధిస్తున్నారని అన్నారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!