
.jpg&w=3840&q=75)
సాధారణంగా ఫ్రూట్ కస్టర్డ్‌ను ఆరోగ్యకరమైన స్వీట్‌గా భావిస్తాం. అయితే అందులో ఉపయోగించే తెల్ల చక్కెర, కస్టర్డ్ పౌడర్ కారణంగా కేలరీలు గణనీయంగా పెరుగుతాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ప్రఖర్ సూచించిన ఈ కొత్త రెసిపీలో చక్కెరను, ఆర్టిఫిషియల్ కస్టర్డ్ పౌడర్‌ను పూర్తిగా తొలగించి మఖానా (తామర గింజలు)తో హెల్తీ కస్టర్డ్‌ను తయారు చేస్తున్నారు. ఈ మఖానా కస్టర్డ్‌లో తక్కువ కేలరీలు ఉండటంతో పాటు పండ్లలోని సహజ పోషకాలు కూడా శరీరానికి అందుతాయి. ఒక గిన్నె కస్టర్డ్‌లో సుమారు 200 నుంచి 230 కేలరీలు మాత్రమే ఉండగా, ఇందులో 7 నుంచి 9 గ్రాముల ప్రోటీన్, 30 నుంచి 35 గ్రాముల కార్బోహైడ్రేట్లు, 6 నుంచి 7 గ్రాముల ఆరోగ్యకరమైన కొవ్వు లభిస్తుంది. కేవలం కొన్ని నిమిషాల్లో తయారయ్యే ఈ డెజర్ట్ ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది.
ఈ షుగర్ ఫ్రీ, గ్లూటెన్ ఫ్రీ కస్టర్డ్ తయారికి పావు కప్పు మఖానా, ఒక టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పొడి, చిటికెడు కుంకుమపువ్వు, అర స్పూన్ తేనె (అవసరమైతే), ముప్పావు కప్పు తక్కువ కొవ్వు పాలు, అలాగే ఆపిల్, కివి, దానిమ్మ గింజలు, అరటిపండు, నల్ల ద్రాక్ష వంటి పండ్లు అవసరం. ముందుగా మఖానా, డ్రై ఫ్రూట్స్ పొడి, కుంకుమపువ్వును కొద్దిపాటి పాలలో నానబెట్టి మెత్తబడిన తర్వాత తేనెతో కలిసి మిక్సీలో ప్యూరీలా చేసుకోవాలి. తరువాత తరిగిన పండ్లపై ఈ మఖానా ప్యూరీ పోసి మెల్లగా కలిపి, ఫ్రిజ్‌లో 20 నిమిషాలు ఉంచితే చల్లని కస్టర్డ్ సిద్ధమవుతుంది. సాధారణ కస్టర్డ్‌తో పోలిస్తే ఇందులో ఫైబర్, మెగ్నీషియం, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునేవారికి, మధుమేహంతో బాధపడేవారికి ఇది అద్భుతమైన హెల్తీ స్వీట్ ఎంపికగా ఉపయోగపడుతుంది.
గమనిక : ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!