
గాసిప్స్

విశాఖపట్నం-లింగంపల్లి మధ్య నడిచే జన్మభూమి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12805/12806) రైళ్ల కొత్త ప్రయాణ సమయాలను దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఈ కొత్త టైమింగ్స్ అమల్లోకి వస్తాయి. విశాఖపట్నం నుంచి లింగంపల్లికి (12806) రైలు ఉదయం 6.20కి బయల్దేరి, రాత్రి 7.15కి చేరుతుంది. లింగంపల్లి-విశాఖపట్నం (12805) రైలు ఉదయం 6.55కి బయల్దేరి రాత్రి 7.50కి విశాఖపట్నం చేరుతుంది.
అదేవిధంగా, సంక్రాంతి రద్దీ దృష్ట్యా వీక్లీ రైళ్లు కొంతకాలం పొడిగించబడ్డాయి. సికింద్రాబాద్-అనకాపల్లి (07041) రైలు జనవరి 4, 11, 18 తేదీల్లో, అనకాపల్లి-సికింద్రాబాద్ (07042) జనవరి 5, 12, 19న, హైదరాబాద్-గోరఖ్‌పుర్ (07075) జనవరి 9, 16, 23న, గోరఖ్‌పుర్-హైదరాబాద్ (07076) జనవరి 11, 18, 25న ప్రయాణిస్తాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!