
న్యూస్
.jpg&w=3840&q=75)
జనగణన–2027లో భాగంగా ప్రజలను ఉద్దేశపూర్వకంగా ఇబ్బందికి గురిచేసే, అభ్యంతరకరమైన లేదా అసంబద్ధమైన ప్రశ్నలు అడిగే అధికారులపై కఠిన చర్యలు తప్పవని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది. ఈ ప్రక్రియలో పాల్గొనే సమయంలో ప్రజలను ఇబ్బందిపెట్టే విధంగా ప్రశ్నలు అడిగే అధికారులకు రూ.1,000 వరకు జరిమానాతో పాటు మూడేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందని చట్టం పేర్కొంటుందని తెలిపారు.
ఈ మేరకు రాష్ట్రాలకు పంపిన ఉత్తర్వుల్లో రిజిస్ట్రార్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ మృత్యుంజయ కుమార్ నారాయణ్ స్పష్టం చేశారు. జనగణన సమయంలో అధికారులు విధిగా నిబంధనలను పాటించాలని, ప్రజల గౌరవాన్ని కాపాడాలని ఆయన సూచించారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!