
న్యూస్

విజయవాడ ఉగ్ర లింకుల కేసులో దర్యాప్తు కొనసాగుతున్న క్రమంలో ఇప్పటివరకు 12 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. కేసులో మరిన్ని సంబంధాలను వెలికితీయడానికి నిందితులను కస్టడీలోకి తీసుకుని లోతుగా విచారించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ కేసులో అల్ హకీమ్ షుకూర్ పేరు తెరపైకి రావడం ప్రస్తుతం కీలక పరిణామంగా మారింది.
యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు ప్రేరేపించినట్లు అల్ హకీమ్ షుకూర్‌పై ఆరోపణలు ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. బెన్‌ఎక్స్ గ్రూప్ ఏర్పాటు ద్వారా ఈ కార్యకలాపాలకు బలాన్ని ఇచ్చినట్లు కూడా పోలీసులు గుర్తించారు. అల్ హకీమ్ ఎక్కడి నుంచి హ్యాండ్లర్‌గా వ్యవహరించారన్న విషయంపై అధికారులు ఆరా తీస్తున్నారు, దర్యాప్తు కొనసాగుతోంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!