
న్యూస్

ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా శాఖ రాష్ట్రంలోని ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు కొత్త నిబంధనలు విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు రోజుకు గరిష్టంగా ఐదు గంటలు మాత్రమే నడపాలి. స్కూల్, కాలేజీ సమయాల్లో అలాగే సెలవు రోజుల్లో కోచింగ్ తరగతులు నిర్వహించరాదు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించి వారి సాధారణ చదువులకు ఆటంకం కలగకుండా ఉండేలా ఈ నిర్ణయం తీసుకున్నారు.
విద్యార్థి మధ్యలో కోర్సు మానేస్తే మిగిలిన ఫీజును తిరిగి చెల్లించాల్సి ఉంటుందని నిబంధనల్లో పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లు కోచింగ్ సెంటర్లు తమ వద్ద ఉంచకూడదు. నిబంధనలు ఉల్లంఘిస్తే మొదటిసారి రూ.50 వేలు, రెండోసారి రూ.లక్ష జరిమానా విధించనున్నారు. ఫిర్యాదుల పరిష్కారానికి ఎస్పీ, డీఈవో సభ్యులుగా కమిటీ ఏర్పాటు చేయనున్నారు.



.jpg&w=3840&q=75)

















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!