
జనరల్

దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ రంగం చాలా వేగంగా పెరుగుతోంది. 2024–25లో ఈ రంగం ఆదాయం 9% పెరిగి రూ.1.2 లక్షల కోట్లు దాటింది. ప్రజల్లో ఆరోగ్య బీమా గురించి అవగాహన పెరగడం, అనారోగ్యం వచ్చినప్పుడు ఖర్చులను ఎదుర్కొనే అవసరం పెరగడం దీనికి కారణం. సేవలు త్వరగా అందించడానికి ఐఆర్‌డీఏఐ కొత్త నియమాలు తీసుకొచ్చింది. ఇక నుంచి నగదు రహిత చికిత్సకు ముందస్తు అనుమతి గంటలోపు, చివరి క్లెయిమ్ ఆమోదం మూడు గంటల్లో ఇవ్వాలి.
అలాగే వయస్సు పెరగడం, ఎక్కువ కవరేజ్ తీసుకోవడం వల్ల బీమా ప్రీమియంలు కూడా పెరుగుతున్నాయి. బీమా పాలసీలు అందరికీ అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించాలని సూచించారు. 2024–25లో బీమా భరోసా పోర్టల్‌లో వచ్చిన ఫిర్యాదుల్లో 93% పరిష్కరించారు. అయితే పాలసీ నిబంధనలు, కో-పేమెంట్, పరిమితులు మించితే క్లెయిమ్ తిరస్కరించే అవకాశం ఉంటుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!