
_2K.png&w=3840&q=75)
టీమ్ఇండియా యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి పిల్లల కోసం అందించే అత్యున్నత పౌర పురస్కారమైన ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ లభించింది. చిన్న వయసులోనే క్రికెట్లో చూపిన అసాధారణ ప్రతిభ, క్రీడపై అతని అంకితభావానికి గుర్తింపుగా ఈ గౌరవాన్ని అందించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా వైభవ్ ఈ అవార్డును స్వీకరించాడు. ఇది అతని క్రీడా జీవితంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.
వైభవ్ సూర్యవంశీ 2025లో తన అసాధారణ బ్యాటింగ్‌తో అరుదైన రికార్డులు నెలకొల్పాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్, యూత్ వన్డే, యూత్ టెస్ట్, ఇండియా-ఏ, స్మాట్, అండర్-19 ఆసియా కప్, విజయ్ హజారే ట్రోఫీ వంటి అన్ని స్థాయిల్లో శతకాలు నమోదు చేసి ప్రత్యేక గుర్తింపు సంపాదించాడు. ఇటీవల ఓ మ్యాచ్‌లో కేవలం 60 బంతుల్లోనే 190 పరుగులు చేసి క్రికెట్ వర్గాల్లో సంచలనం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌తో వైభవ్ దేశవ్యాప్తంగా క్రికెట్ అభిమానుల దృష్టిని ఆకర్షించడమే కాకుండా, భవిష్యత్తులో టీమ్ ఇండియాకు కీలక ఆటగాడిగా మారే సామర్థ్యం తనలో ఉందని మరోసారి నిరూపించాడు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!