
సినిమాలు

అమెరికాలో కొకైన్ అక్రమ రవాణా కేసులో ఇద్దరు భారతీయులను పోలీసులు అరెస్టు చేశారు. ఇండియానా రాష్ట్రం పుట్నం కౌంటీలో గురుప్రీత్ సింగ్ (30), జస్వీర్ సింగ్ అనే వ్యక్తులను అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ బృందం అదుపులోకి తీసుకుంది. సెమీ ట్రక్కులో డ్రగ్స్ తరలిస్తున్న సమయంలో వీరిని పట్టుకున్నారు.
ట్రక్కులోని స్లీపర్ బెర్త్‌లో దాచిన 309 పౌండ్ల కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ డ్రగ్స్‌ను ప్రత్యేకంగా దాచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. భారీ మొత్తంలో డ్రగ్స్ అక్రమంగా తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని అధికారులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న కొకైన్‌తో సుమారు 1 లక్ష 13 వేల మంది అమెరికన్ల ప్రాణాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పోలీసులు ఆరోపించారు. ఈ ఘటనపై మరింత లోతైన దర్యాప్తు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!