
రాజకీయాలు

భారతీ ఎయిర్టెల్ ప్రపంచ టెలికాం రంగంలో మరో కీలక మైలురాయిని అందుకుంది. జీఎస్ఎంఏ ఇంటెలిజెన్స్ గణాంకాల ప్రకారం, 65 కోట్లకు పైగా చందాదార్లతో Bharti Airtel ప్రపంచంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా నిలిచింది. భారతదేశంతో పాటు ఆఫ్రికాలో కూడా సేవలు అందిస్తున్న ఎయిర్టెల్, వినియోగదారుల సంఖ్యలో గణనీయమైన వృద్ధిని నమోదు చేసింది.
మార్చి 31 నాటికి భారత్‌లోనే 46.4 కోట్ల మంది వినియోగదారులు ఉండగా, అందులో మొబైల్, ఐఓటీ, బ్రాడ్‌బ్యాండ్, డిజిటల్ టీవీ, ఐపీటీవీ సేవలు పొందుతున్నవారు ఉన్నారు. అలాగే ఆఫ్రికాలోని 14 దేశాల్లో మరో 17.9 కోట్ల మందికి పైగా చందాదార్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చందాదార్ల సంఖ్యలో China Mobile మొదటి స్థానంలో ఉండగా, ఎయిర్టెల్ రెండో స్థానాన్ని దక్కించుకుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!