
టెక్నాలజీ

సంధ్యా ఫిలిమ్స్ బ్యానర్‌పై చందా లక్ష్మీనారాయణ నిర్మించిన “గాలి” సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ నెల 17 న ఘనంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. టి. రాము దర్శకత్వంలో రూపొందిన ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో రాంప్రసాద్ గురజాడ, అంజలి రామవతు, శ్రీకాంత్ పెరుమండ్ల, యస్. చంద్రకళ, చందా రోజా రాణి, బి.వి. సుబ్బారెడ్డి తదితరులు నటించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.

ఈ సందర్భంగా నిర్మాత లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కథ నచ్చడంతో ఈ సినిమా నిర్మించానని, అనుకున్నదానికంటే మంచి ఫలితం వచ్చిందని తెలిపారు. దర్శకుడు రాము మాట్లాడుతూ కలి పురుషుడు మరియు అమ్మవారి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా ప్రధాన అంశమని, సస్పెన్స్‌తో సాగే ఈ చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుందని చెప్పారు.



.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!