

ఏఐ చాట్‌బాట్ గ్రోక్‌ను కేంద్రంగా చేసుకుని అసభ్య కంటెంట్ వివాదం తీవ్ర రూపం దాల్చింది. కొందరు ఆకతాయిలు ప్రైవేట్ వ్యక్తుల ఫోటోలను అప్లోడ్ చేసి, న్యూడ్ చిత్రాలు తయారు చేయమంటూ గ్రోక్‌ను ప్రాంప్ట్ చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గ్రోక్ నుంచి వచ్చిన అసభ్య అవుట్‌పుట్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు, పోర్న్ వెబ్సైట్లకు ఎక్కిస్తున్నారని సమాచారం. ఇందులో అమాయక మహిళలు, చిన్న పిల్లలకు సంబంధించిన కంటెంట్ ఉండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.
.jpeg)
ఈ ఘటనపై రాజ్యసభ సభ్యురాలు ప్రియాంక చతుర్వేది కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దాంతో స్పందించిన కేంద్రం, ట్విట్టర్ (X)కు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రోక్ చాట్‌బాట్ ద్వారా రూపొందుతున్న అసభ్య కంటెంట్‌ను తక్షణమే తొలగించాలని, అలాగే 72 గంటల్లో తీసుకున్న చర్యలపై యాక్షన్ టేకెన్ రిపోర్ట్ సమర్పించాలని ఆదేశించింది. ఏఐ టెక్నాలజీ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు కఠిన చర్యలు అవసరమని కేంద్రం స్పష్టం చేసింది.

.webp&w=3840&q=75)


















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!