

గత 12 ఏళ్లుగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజలకు చెప్పినదే చేస్తూ పాలన సాగిస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తెలిపారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఈసారి ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ అన్ని వర్గాలకు మేలు చేసేలా రూపొందించామని అన్నారు. బడ్జెట్ అంటే కేవలం ఉచితాలు లేదా ఎన్నికల ప్రయోజనాల కోసమే అన్న భావనకు భిన్నంగా, 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించే దిశగా ఈ బడ్జెట్ మరో ముందడుగుగా నిలుస్తుందని చెప్పారు.
తెలంగాణకు ప్రత్యేకంగా ఈ బడ్జెట్ ద్వారా విస్తృత ప్రయోజనాలు లభించనున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్ ఐటీ హబ్, ఎడ్యుకేషన్ హబ్, డేటా సెంటర్ హబ్, మెడికల్, బయోఫార్మా హబ్‌గా ఎదిగిందని పేర్కొన్నారు. MSMEలకు ఇచ్చిన ప్రోత్సాహకాలు, బయోఫార్మా SHAKTI పథకం, NIPER సంస్థల విస్తరణ, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల పెంపు, మహిళల హాస్టళ్లు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణం, జాతీయ రహదారులు, పరిశోధనా సంస్థలకు భారీ కేటాయింపులు— ఇవన్నీ దేశవ్యాప్తంగా సుస్థిరమైన అభివృద్ధికి నిదర్శనమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!