

న్యూఢిల్లీ భారత్ మండపంలో ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సదస్సు భారత్‌కే కాకుండా దక్షిణాసియా ప్రాంతానికి కూడా గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రోన్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి పాల్గొన్నారు. ఉదయం 11 గంటలకు జరిగే ఇండియా ఏఐ ఇంపాక్ట్ ఎక్స్పో 2026 ను ప్రధాని సందర్శించి, ప్రపంచ నాయకులతో కలిసి వివిధ దేశాల పెవిలియన్లను వీక్షించనున్నారు. ఈ సదస్సు మేడిన్ ఇండియా ఆవిష్కరణలకు మరియు భారత సృజనాత్మకతకు వేదికగా నిలిచిందని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సదస్సు భారత యువతలో కొత్త ఉత్సాహాన్ని నింపుతోందని ప్రధాని అన్నారు. ప్రారంభ దశలో ఏఐపై అనేక సందేహాలు ఉన్నప్పటికీ, యువత దానిని ప్రయోజనకరంగా వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. ఏఐ అణుశక్తిలాగే రెండు వైపులా పదునున్న అస్త్రమని, విజన్‌తో పాటు సామాజిక బాధ్యత కూడా అత్యంత ముఖ్యమని ఆయన హెచ్చరించారు. భారత్‌కు యువత కొత్త శక్తిగా ఎదుగుతున్నారని, ఏఐ టెక్నాలజీ వినియోగంపై తుది నిర్ణయం ఎప్పటికీ మనిషి చేతుల్లోనే ఉండాలని ప్రధాని మోడీ స్పష్టం చేశారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!