

తెలంగాణ ప్రజా రవాణా రంగంలో భారీ మార్పులకు నాంది పలుకుతూ TGSRTC 2 వేల కొత్త ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం ఈ-డ్రైవ్ పథకం కింద ఈ బస్సులకు అధికారిక ఆమోదం లభించింది. హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా మార్చడమే కాకుండా, పెరుగుతున్న ప్రయాణికుల రద్దీని తగ్గించి సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడం ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యంగా ఉంది. లో-ఫ్లోర్, సెమీ లో-ఫ్లోర్, స్టాండర్డ్ ఏసీ, మినీ ఎలక్ట్రిక్ బస్సులుగా వీటిని దశలవారీగా సేవల్లోకి తీసుకురానున్నారు.
వృద్ధులు, చిన్నారులు, దివ్యాంగులకు అనుకూలంగా లో-ఫ్లోర్ బస్సులకు ప్రాధాన్యం ఇవ్వనుండగా, హైదరాబాద్ పాతబస్తీ వంటి జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో మినీ ఎలక్ట్రిక్ బస్సులు నడపనున్నారు. అలాగే చౌటుప్పల్–దిల్సుఖ్నగర్ వంటి కీలక మార్గాల్లో స్టాండర్డ్ ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. మెట్రో స్టేషన్లకు లాస్ట్ మైల్ కనెక్టివిటీగా ఈ బస్సులను వినియోగించడం ద్వారా ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలగనుంది. డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులు రావడంతో కాలుష్యం తగ్గి, ప్రయాణం మరింత సుఖమయంగా మారనుంది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!