

ఇంటర్ ఫలితాలను (2026) ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తున్నారన్న సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని తెలంగాణ విద్యాశాఖ ఖండించింది. ఈ ప్రచారంలో ఏ విధమైన వాస్తవం లేదని స్పష్టం చేసింది. ఇంటర్ ఫలితాలు షెడ్యూల్ ప్రకారమే ప్రకటిస్తారని అధికారులు పేర్కొన్నారు. గతంలో ఏప్రిల్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కాలేదని ఈ సందర్భంలో గుర్తు చేశారు.
తెలంగాణ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం ‘ఎక్స్’ లో పోస్టు పెట్టి గతేడాది ఇంటర్ ఫలితాల విడుదల తేదీలను వెల్లడించింది: 2014 – మే 3, 2015 – ఏప్రిల్ 22, 2016 – ఏప్రిల్ 22, 2017 – ఏప్రిల్ 16, 2018 – ఏప్రిల్ 13, 2019 – ఏప్రిల్ 18, 2020 – జూన్ 18, 2021 – జూన్ 28, 2022 – జూన్ 28, 2023 – మే 9, 2024 – ఏప్రిల్ 24, 2025 – ఏప్రిల్ 22. ఫలితాలు మూల్యాంకనం, ఇతర అంశాల ఆధారంగా వస్తాయని, విద్యార్థులు, తల్లిదండ్రులు అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలను నమ్మకూడదని విద్యాశాఖ కోరింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!