

టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య సరికొత్త మాస్ యాక్టింగ్ తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఆయన హీరోగా రామ్ దేసిన్ దర్శకత్వంలో తెరకెక్కిన యాక్షన్ డ్రామా ‘బ్యాడ్ బాయ్ కార్తీక్’. తాజాగా ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదలై అంచనాలను భారీగా పెంచేసింది. ఈ నెల 17న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ట్రైలర్‌లో, నాగశౌర్య మాస్ హీరోగా మెప్పించాడు.
ఈ ట్రైలర్‌లో దుర్మార్గుల ఆగడాలతో అల్లాడిపోతున్న ప్రాంతాన్ని కాపాడే కథ బాగా హైలైట్ అవుతోంది. నాగ సౌర్య యాక్షన్ సీన్స్‌తో పాటు సాయికుమార్‌తో కలిసి చేసే కామెడీ అద్భుతంగా ఉంది. శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాసరావు చింతలపూడి నిర్మించిన ఈ చిత్రంలో విధి హీరోయిన్‌గా నటిస్తుంది. సముద్రఖని విలన్‌గా పవర్‌ఫుల్ రోల్‌లో కనిపిస్తున్నాడు. జీ స్టూడియోస్ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకుంది.నాగశౌర్య పూర్తి మాస్ అవతారంలో కనిపించడం ఈ సినిమా ప్రత్యేకత. మాస్, యాక్షన్, ఎమోషన్ కలగలిసిన ఈ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి రెడీగా ఉంది. ఇందులో శ్రీదేవి విజయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!