
సినిమాలు

విజయ్ (Vijay) కథానాయకుడిగా హెచ్.వినోద్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘జన నాయగన్’. సంక్రాంతికి విడుదల కావాల్సిన ఈ సినిమా సెన్సార్ బోర్డు వివాదంతో వాయిదా పడింది. మద్రాసు హైకోర్టు, సుప్రీంకోర్టు, సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్.. ఇలా జనవరి నెల అంతా ఈ సినిమా హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ‘జన నాయగన్’((Jana Nayagan) విడుదలకు సిద్ధమవుతోంది. కోర్టు ఆదేశాల మేరకు సినిమాను చిత్ర బృందం సెన్సార్ బోర్డు రివ్యూ కమిటీకి పంపింది. అంతా సబబుగా జరిగితే మార్చి నెలలో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!