.jpg&w=3840&q=75)

పవన్ కళ్యాణ్ ఒక వైపు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరో వైపు తన సినిమా ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్తున్నారు. ఇటీవల ఉస్తాద్ భగత్ సింగ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో, తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆయన మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ఏకైక చిత్రం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతోంది.
ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఇప్పటికే అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం. ముందే ప్రకటించిన ఈ ప్రాజెక్ట్ రాజకీయ పనుల కారణంగా ఆలస్యమైంది. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ పూర్తయి, పవన్ కళ్యాణ్ స్టైల్‌కు తగ్గట్టుగా పవర్‌ఫుల్ కథను సిద్ధం చేశారు. ఈ సినిమాను జూన్ లేదా జూలైలో ప్రారంభించేందుకు యూనిట్ ప్లాన్ చేస్తోంది. స్టైలిష్ డైరెక్టర్‌గా పేరుగాంచిన సురేందర్ రెడ్డి, పవన్ కళ్యాణ్‌ను ఎలా చూపిస్తారన్నదానిపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఈ సినిమా మాస్, క్లాస్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.










.jpg&w=3840&q=75)











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!