
బిజినెస్

హైదరాబాద్: సోషల్ మీడియా పేరుతో చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి హెచ్చరించారు. మహిళా ఐఏఎస్ అధికారి గౌరవానికి భంగం కలిగించేలా టీవీ ఛానల్ మరియు కొన్ని యూట్యూబ్ ఛానళ్లు కథనాలు ప్రసారం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు.
సోషల్ మీడియాను బాధ్యతగా ఉపయోగించాలంటూ గతంలోనే హెచ్చరించామని డీజీపీ తెలిపారు. వ్యక్తులు, వారి కుటుంబాలపై తప్పుడు వార్తలు ప్రచారం చేయడం, వ్యక్తిగత విషయాలపై ఫేక్ న్యూస్ సృష్టించడం నేరమని స్పష్టం చేశారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదని ఆయన స్పష్టంగా చెప్పారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!